తోడేలు వేట మొదలైంది.. థ్రిల్లర్ మూవీ ‘నరివెట్ట’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-31 14:57:10  IST  )

మలయాళ హీరో టోవినో థామస్(Tovino Thomas) వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఆయన గత ఏడాది ‘ఐడెంటిటీ’ సినిమాతో హిట్ సాధించారు.

తోడేలు వేట మొదలైంది.. థ్రిల్లర్ మూవీ ‘నరివెట్ట’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: మలయాళ హీరో టోవినో థామస్(Tovino Thomas) వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఆయన గత ఏడాది ‘ఐడెంటిటీ’ సినిమాతో హిట్ సాధించారు. టోవినో థామస్ ‘నరివెట్ట’(Narivetta) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనురాగ్ మనోహర్(Anurag Manohar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2000ల ప్రారంభంలో వయనాడ్‌లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించారు. అబిన్ జోసెఫ్ రాసిన ఈ చిత్రంలో ప్రియంవద కృష్ణన్, సూరజ్ వెంజరమూడు, ఆర్య సలీం కీలక పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ మలయాళంలో విడుదలై విమర్శలు, ప్రశంసలు పొందింది. దీంతో మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా, ‘నరివెట్ట’ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

అంతేకాకుండా టోవినో థామస్ పోస్టర్‌ను షేర్ చేస్తూ మే 23న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ పోస్టర్‌లో తోడేలు వేట అంటూ హీరో పోలీస్ పాత్రలో భయంకరమైన లుక్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది.ఇందులో టోవినో పాత్ర మాత్రమే ఈ దారుణాలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కనుగొంటున్నట్లు అనిపిస్తుంది, కానీ అకస్మాత్తుగా విధి మలుపులో, ఒక నిరసనకారుడి మరణానికి అతను బాధ్యత వహిస్తాడు. అధికారులు ఇప్పుడు మావోయిస్టుల ప్రమేయాన్ని అనుమానించడంతో, కథాంశం మరింత చిక్కబడుతుంది. ఈ తీవ్రమైన ట్రైలర్ భారతదేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత అణచివేత పై ఒక ఉత్కంఠభరితమైన కథను హామీ ఇస్తుంది.

Next Story