'ప్రాణాలతో చెలగాటమాడే వెబ్ సిరీస్'.. స్క్విడ్‌ గేమ్-3 వచ్చేసింది!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-25 06:34:23  IST  )

2021లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్.

ప్రాణాలతో చెలగాటమాడే వెబ్ సిరీస్.. స్క్విడ్‌ గేమ్-3 వచ్చేసింది!
X

దిశ, వెబ్ డెస్క్: 2021లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ సిరీస్‌ నుంచి ఇప్పటికే రెండు సీజ‌న్‌లు రాగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాయి. ఫ‌స్ట్ సీజ‌న్ అయితే రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు చూశారు. ఇక గతేడాది 2వ సీజ‌న్ రాగా.. ఇది కూడా రికార్డు వ్యూస్‌ను అందుకుంది. ఈ సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు తాజాగా సీజన్-3 కూడా రాబోతుంది. జూన్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న చివరి సిరీస్‌ ‘స్క్విడ్‌గేమ్‌ 3’ (Squid Game 3) కావటంతో సినీ ప్రేమక్షులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. గూస్ బంప్స్ రావటం ఖాయం. మరీ ఎందుకు ఆలస్యం ఉత్కంఠరేపుతోన్న ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

Next Story