- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం ప్రారంభమవుతోంది.. ప్రభావాన్ని తట్టుకునేందుకు సిద్ధంకండి అంటూ యంగ్ బ్యూటీ పోస్ట్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ (Palak Tiwari) నటి శ్వేతా కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘డాకు రామ్ కిషన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ పాలక్ తివారి (Palak Tiwari) నటి శ్వేతా కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘డాకు రామ్ కిషన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత ‘రోసీ, కిసీకా భాయ్ కిసీకా జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan) వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇటీవల హారర్ కామెడీ మూవీ ‘భూత్ని’(Bhootnii) తో హిట్ అందుకుంది. ప్రస్తుతం పాలక్ తివారి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు ’రోమియో S-3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఠాకూర్ అనూప్ సింగ్(Thakur Anoop Singh) హీరోగా నటిస్తున్నాడు. ఇందులో పాలక్ తివారి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి గుడ్డు దానోయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను పెన్ స్టూడియోస్, వైల్డ్ రివర్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జయంతిలాల్ గాడ, దవాల్ గాడ నిర్మిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘రోమియోS-3’ మూవీ మే 16న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, పాలక్ తివారి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను షేర్ చేసింది. ఇక ఇందులో అనూప్ సింగ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. రూల్స్ పాటించకుండా విలన్స్‌ను చితక్కొడుతూ కనిపించాడు. ఇక ఈ పోస్ట్‌కు పాలక్ తివారి ‘‘యుద్ధం ప్రారంభమవుతోంది.. ప్రభాన్ని తట్టుకునేందుకు సిద్ధంకండి’’ అనే క్యాప్షన్ జత చేసింది.






