యుద్ధం అతనికి ఒక లక్ష్యాన్ని ఇచ్చింది.. క్యూరియాసిటీ పెంచుతున్న ‘VD-14’ ఫస్ట్ లుక్ పోస్టర్

by Hamsa |   ( Updated:2025-05-09 11:22:55.0  )
యుద్ధం అతనికి ఒక లక్ష్యాన్ని ఇచ్చింది.. క్యూరియాసిటీ పెంచుతున్న ‘VD-14’ ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం విజయ్, రాహుల్ సాంకృత్యాన్(Rahul Sankrityan) కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘VD-14’. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), యల మంచలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.

నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి అంచనానలు పెంచారు. ఇందులో ఆయన మెడిటేషన్ చేస్తూ షాకింగ్ లుక్‌లో కనిపించాడు. ఈ పోస్ట్‌కు ‘‘దేవతలు అతనికి బలాన్ని ఇచ్చారు. యుద్ధం అతనికి ఒక లక్ష్యాన్ని ఇచ్చింది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం విజయ్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినీ ప్రియుల్లో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలనే ఆసక్తి పెరిగింది.

Click For Tweet..



Next Story

Most Viewed