కేవీఎన్ ప్రొడక్షన్స్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది

by Pulgam srinivas |

కేవీఎన్ ప్రొడక్షన్స్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను జూన్ 19 ఉదయం 9:45 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థల్లో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ బ్యానర్ ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్‌తో జన నాయగన్ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. అలాగే కన్నడ స్టార్ హీరో యష్‌తో టాక్సిక్ చిత్రాన్ని కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోంది.

ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా కేవీఎన్ ప్రొడక్షన్స్ తమ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. జూన్ 19 ఉదయం 9:45 గంటలకు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించనున్నట్లు తెలియజేస్తూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో ఎరుపు రంగులో కనిపిస్తున్న లవ్ సింబల్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో ఇది ఓ ప్రేమకథా చిత్రమై ఉండొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు అయితే సినిమా కథాంశం ఏమిటి? ఇందులో నటించే హీరో, హీరోయిన్ ఎవరు? దర్శకుడు ఎవరు? వంటి పూర్తి వివరాలు రేపటి అధికారిక ప్రకటనతో వెల్లడి కానున్నాయి.




Next Story