- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్టార్ హీరో చేతుల మీదుగా విడుదల కానున్న 'శ్రీనివాస మంగాపురం' టీజర్
ఈరోజు సాయంత్రం 6 గంటలకు మహేష్ బాబు చేతుల మీదుగా శ్రీనివాస మంగాపురం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో వెండితెరకు పరిచయం కానున్నాడు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రవీనా టాండన్ కూతురు రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించబోతుంది. నిన్న ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక తాజాగా మూవీ యూనిట్, ఈ సినిమా టీజర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి వెండితెరకు పరిచయం కాబోతున్న హీరో కావడంతో, ఈయనకు మహేష్ బాబు అభిమానుల అండదండలు కూడా ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






