ఈ రకంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు.. అనుష్క టీమ్ సీరియస్

by Chukka Sudharani |

గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై ఎట్టకేలకు అనుష్క టీమ్ క్లారిటీ ఇచ్చారు.

ఈ రకంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు.. అనుష్క టీమ్ సీరియస్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఎవర్ గ్రీన్ అనుష్క శెట్టి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అనుష్క టీమ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘ఒకరి పర్సనల్ లైఫ్‌ను డైలీ హెడ్‌లైన్స్‌గా మార్చే ముందు కనీసం అది అఫీషియలా కాదా.. అనేది కూడా చూడటం లేదు. ఊహించడం, అంచనా వేయడం అనధికారిక సమాచారాన్ని పదేపదే ప్రచురించడం సరైన పద్ధతి కాదు. అన్నిటికంటే నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. ఆమె వయసుపై అనవసరమైన శ్రద్ధ చూపడం.

ప్రతి పోస్ట్‌లోనూ 44 అనే నంబర్‌ను ఏదో వివాదాస్పదమైన అంశంలా ఎందుకు హైలైట్ చేస్తున్నారు..? వయసు అంత పెద్ద సమస్య అయితే.. హీరోల వయసు విషయంలో కూడా ఇదే ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు? మహిళల విషయంలోనే ఈ కథనం ఎందుకు భిన్నంగా ఉంటుంది. ఆమె తన కెరీర్‌ను కేవలం ప్రతిభతో, ఎంతో హుందాగా నిర్మించుకున్నారు. ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదు. తన పర్సనల్ లైఫ్‌ను గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం సమంజసం కాదు.. వివాహం అనేది వ్యక్తిగత విషయం.. అది బ్రేకింగ్ న్యూస్ కాదు. కేవలం వ్యూస్ కోసం వాడాల్సిన అంశం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. హద్దులను గౌరవించండి.. ముఖ్యంగా హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా, గౌరవంగా చూడటం నేర్చుకోండి’ అంటూ టీమ్ స్పష్టం చేశారు.

Next Story