Akhanda 2 : అఖండ 2 ‘తాండవం’ మొదలు.. పవర్ ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చిన బాలకృష్ణ

by Chukka Sudharani |

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది.

Akhanda 2 : అఖండ 2 ‘తాండవం’ మొదలు.. పవర్ ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చిన బాలకృష్ణ
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. ‘అఖండ 2’ నుంచి ‘ది తాండవం’ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య బాబు పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను కూడా ఆకట్టుకుంటున్నాడు. ఈ పాటకు లిరిక్స్ కల్యాణ్ చక్రవర్తి రాయగా.. శంకర్ మహాదేవన్, కైలాశ్ ఖేర్, దీపక్ ఆలపించారు. మొత్తంగా ఈ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. కాగా.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ చిత్రం.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అఖండకు సీక్వెల్‌గా రాబోతున్నది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తూ.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి మరింత తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లింక్

Next Story