‘లెనిన్’ విడుదలపై వీడిన సస్పెన్స్

by Chukka Sudharani |

మే 1న విడుదల కావాల్సిన ‘లెనిన్’ మూవీ వాయిదా పడినట్లు వార్తలు రాగా.. తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.

‘లెనిన్’ విడుదలపై వీడిన సస్పెన్స్
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న అఖిల్.. ఇప్పుడు లెనిన్ చిత్రంతో వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మే 1న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడినట్లు వార్తలు రాగా.. తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘‘లెనిన్’ వాస్తవానికి మే 1వ తేదీన విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. మన ప్రియమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ఏప్రిల్ 30న విడుదలవుతున్న తరుణంలో, సానుకూల, ఆరోగ్యకరమైన వాతావరణంలో మనమందరం కలిసి సినిమాను ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన సమయం అని మేము భావిస్తున్నాము. రామ్ చరణ్‌కి, అఖిల్‌కి మధ్య ఉన్న బంధం దృష్టిలో పెట్టుకుని.. ఈ నిర్ణయం అత్యంత గౌరవ మర్యాదలతో తీసుకోబడింది. ఇప్పుడు లెనిన్ 2026 జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. ప్రతి భావోద్వేగంతో నిండిన 'లెనిన్' ఒక సంపూర్ణ సినిమా వేడుకగా మీ ముందుకు తీసుకొస్తామని మీకు హామీ ఇస్తున్నాము. వెండితెరపై ఎగ్జైటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అని తెలిపారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కన్నడ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story