తెలుగులో విడుదల కాబోతున్న సూపర్ హిట్ మూవీ ‘కేసరి చాప్టర్-2’.. ఎప్పుడంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-14 09:47:42  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), రెజీనా, అనన్య పాండే(Ananya Pandey), మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘కేసరి చాప్టర్-2’.

తెలుగులో విడుదల కాబోతున్న సూపర్ హిట్ మూవీ ‘కేసరి చాప్టర్-2’.. ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), రెజీనా, అనన్య పాండే(Ananya Pandey), మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘కేసరి చాప్టర్-2’. కరణ్ సింగ్ (Karan Singh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని 1019 ఏప్రిల్ 13న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ ఊచకోత ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామా హీరో మూవీ ‘కేసరి’కి సీక్వెల్‌గా వచ్చింది. దీనికి సాఫ్యత్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్స్‌లోకి వచ్చిన ఘన విజయం సాధించింది.

కేవలం హిందీ భాషల్లో విడుదలవగా.. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వెల్లడించారు. ఈ సినిమాను తెలుగులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ‘కేసరి చాప్టర్-2’ మూవీ తెలుగు భాషలో మే 23న రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు. ఇక దీనిని సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ది స్పిరిట్ మీడియా బ్యానర్స్‌పై తీసుకురాబోతున్నారు. అయితే పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ‘‘పాతి పెట్టబడినా కేవలం నిజం కాదు - అది అందని న్యాయం. న్యాయం, శక్తివంతమైన కథ అయిన ‘కేసరి చాప్తర్-2’ ను మే 23న తెలుగులో థియేటర్లకు తీసుకురావడం పట్ల గర్వంగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక అది చూసిన సీని ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Click For Tweet..

Next Story