- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనుషులే భగవంతుడిగా అవతరించిన స్టోరీ.. భగవంతుడు టీజర్ రిలీజ్..
టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్(Thiruveer) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘భగవంతుడు’(Bhagavanthudu).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్(Thiruveer) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘భగవంతుడు’(Bhagavanthudu). జీజీ విహారి(GG Vihari) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవి పనస ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై రవి పనస నిర్మిస్తున్నారు. ఇక ఇందులో క్రేజీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రిషి నాగరాజు, కాలకేయ ప్రభాకర్, రవీంద్ర విజయ్, మురళిధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పల్నాడు నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక టీజర్‌లో పల్నాడులో 9వ శతాబ్థంలో అంటూ స్టార్ట్ అయి.. ఈ భూమి మీద రెండు రకాల కథలు ఉంటాయి.. ఆ దేవుళ్ళే ఈ భూమి మీద మనుషులుగా అవతరించే కథలు.
రెండు మనుషులే దైవాలుగా అవతరించే కథలు. ఇప్పుడు మీకు నేను రెండో రకం కథ చెబుతాను అంటూ సాగే టీజర్ చాలా ఆసక్తికరంగా ఉన్నది. అంతేకాకుండా టీజర్‌లో చూపించిన విజువల్స్ మరియు తిరువీర్ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా భగవంతుడు టీజర్‌ను చూసేయండి.






