ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోతున్న స్టార్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ‘తీన్ పట్టి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోతున్న స్టార్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ‘తీన్ పట్టి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘ఏక్ విలన్’ చిత్రంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ వరుస ప్రాజెక్ట్స్‌లో నటించింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక గత ఏడాది ‘స్త్రీ-2’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అదే ఫామ్‌తో ఇప్పుడు ‘స్త్రీ-3’ చేస్తోంది. హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కుతుండగా.. ఆగస్టు 13న 2027లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రద్ధా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. ఈ అమ్మడు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం శ్రద్ధా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఆమెకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మూవీ మేకర్స్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏక్తా కపూర్(Ekta Kapoor) నిర్మిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించేందుకు శ్రద్ధా ఏకంగా రూ. 17 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్. అంతేకాకుండా మూవీ విడుదల తర్వాత వచ్చే లాభాల్లోనూ వాటా ఇస్తేనే నటిస్తానని చెప్పడంతో.. దానికి ఏక్తా కపూర్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక శ్రద్ధా నటించేందుకు సంతకం చేయగా.. సెప్టెంబర్ నెలలో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోందట. ఈ అమ్మడు ఓ రికార్డు కూడా బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది.

Next Story