- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ క్యూట్ ఫొటో షేర్ చేసిన ఆ స్టార్ హీరో
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వీటిలో ‘హృదయం పూర్వం’ ఒకటి.

దిశ, సినిమా: 'ఎంపురాన్-2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుకున్న మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal).. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇందులో ‘హృదయం పూర్వం’ కూడా ఒకటి. సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బసితా జోసెఫ్, సంగీత్, సంగీత, లాలూ అలెక్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా ఓనమ్ పర్వదినం సందర్భంగా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా మోహన్‌లాల్ మరో అప్‌డేట్ అందించారు. హీరోయిన్ మాళవిక మోహనన్ పోస్టర్‌ను తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. శనివారం సాయంత్రం 6 గంటలకు హృదయపూర్వం నుంచి ‘వెన్మతి’ అనే పాట రిలీజ్ అవుతుందని తెలిపారు. ఇక ఈ పోస్టర్‌లో మాళవిక లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే, పోస్టర్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తుండటంతో వైరల్‌గా మారింది.






