- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమెతో ఉన్న క్యూట్ ఫొటో షేర్ చేస్తూ విష్ చేసిన స్టార్ హీరో.. ఓ మై గాడ్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్
నేచురల్ స్టార్ నాని(Nani) మనందరికీ సుపరిచితమే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) మనందరికీ సుపరిచితమే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అలా రీసెంట్‌గా నిర్మాతగా ‘కోర్ట్’(court) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చిన్న మూవీగా వచ్చిన ఈ మూవీ భారీ హిట్‌గా నిలిచింది. ఇక హీరోగా దసరా సినిమాతో మొదలుపెట్టి వరుసగా ‘హాయ్ నాన్న’(Hi Nanna), ‘సరిపోదా శనివారం’(Saripoda Sanivaram), ‘హిట్- 3’(Hit-3) సినిమాలతో బ్లాక్ బాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’(The Paradise) అనే సినిమా చేస్తున్నాడు. దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. నాని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే అక్కి.. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చాడు. అయితే తాను అండ్ తన సిస్టర్ ఉన్న చిన్ననాటి ఫొటో షేర్ చేయడం విశేషం. ఇందులో నాని చాలా క్యూట్‌గా బుద్ధిమంతుడులా ఉన్నాడు. దీంతో ఈ పిక్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఓ మై గాడ్ చాలా బ్యూటిఫుల్ పిక్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆ ఆలస్యం నాని చిన్నప్పటి ఫొటోను మీరు కూడా చూసేయండి.






