చిరిగిన షూస్ వేసుకున్న‌ సల్మాన్ ఖాన్..వాటి ధ‌ర ఎన్ని ల‌క్ష‌లు అంటే ?

by velandi.Saikiran |

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ధరించిన ఈ పాత బూట్ల ధర రూ. 1.50 లక్షలు అని టాక్ న‌డుస్తోంది.

చిరిగిన షూస్ వేసుకున్న‌ సల్మాన్ ఖాన్..వాటి ధ‌ర ఎన్ని ల‌క్ష‌లు అంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసి, అగ్రశ్రేణి హీరోగా కొనసాగుతున్నారు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ అంటేనే సల్మాన్ ఖాన్ అన్నట్లుగా పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అలాంటి సల్మాన్ ఖాన్, తాజాగా చిరిగిపోయిన పాత షూలు ధరించారు. ఈ తరుణంలో ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఈ చిరిగిపోయిన షూల గురించి అందరూ ఆరా తీస్తున్నారు.

చిరిగిన షూల‌ ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ధరించిన ఈ పాత బూట్ల ధర రూ. 1.50 లక్షలు అని టాక్ న‌డుస్తోంది. వీటిని ప్రముఖ లగ్జరీ బ్రాండ్ మైసన్ మార్గియెలా తయారు చేసింది. డిస్ట్రస్డ్ లుక్ తో ఈ బూట్లు తయారు చేయడంతో.. పాపులర్ అయ్యాయి. అంటే కొత్తవాటిని పాత వాటిలాగా కనిపించేలా తయారు చేస్తారన్నమాట. ఇది కూడా ఒక ఫ్యాషన్. అయితే సెలబ్రిటీ అయిన సల్మాన్ ఖాన్ వీటిని ధరించిన నేపథ్యంలో.. జనాలు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Next Story