Rashmika Mandanna: రష్మికకు గులాబీలు పంపిన స్పెషల్ పర్సన్.. అసలు విషయం చెప్తూ నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.

Rashmika Mandanna: రష్మికకు గులాబీలు పంపిన స్పెషల్ పర్సన్.. అసలు విషయం చెప్తూ నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఇక ఈ అమ్మడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో డియర్ కామ్రెడ్, గీత గోవిందం వంటి చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక పుష్ప, యానిమల్(Animal) వంటి సినిమాలతో అమ్మడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక గత ఏడాది ‘పుష్ప-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది.

ఇదిలా ఉంటే.. రష్మిక మందన్న ఇటీవల విక్కీ కౌశల్(Vicky Kaushal) సరసన ‘ఛావా’ నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, గులాబి పూల బొకే స్పెషల్ పర్సన్ పంపినట్లు తెలిపింది. ‘‘నీకు నా మొహంలో చిరునవ్వును ఎలా తెప్పించాలో బాగా తెలుసు పాపలు’’ అనే క్యాప్షన్ జత చేసి రెడ్ హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది. కాగా, గత కొద్ది రోజుల నుంచి రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు వీరిద్దరు వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయినప్పటికీ వీరిద్దరు మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.

Next Story