OTT: ఓటీటీలోకి నయా థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by sudharani |
OTT: ఓటీటీలోకి నయా థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా: ‘ముంజ్య’ (Munjya) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) అందుకున్న డైరెక్టర్ ఆదిత్య సర్పోర్ట్‌దార్ (Aditya Sarportdar) తెరకెక్కిస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్ ‘ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్’ (The Secret of the Shields). ఇందులో రాజీవ్ ఖండేల్వార్, సాయి తంహన్‌కర్, గౌరవ్ అమ్లానీ, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)లో జనవరి 31 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

కాగా.. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌ (Historical backdrop)లో థ్రిల్లర్ సిరీస్‌గా రూపొందుతున్న ‘ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్’ కథ విషయానికి వస్తే.. ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) మహరాజ్‌కు చెందిన రహస్య నిధిని రక్షించే సీక్రెట్ ఆర్డర్.. షిల్డర్స్ గ్రూప్‌నకు వస్తుంది. ఆ నిధి వెనుక ఉన్న మిస్టరీ, దాన్ని రక్షించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుందని తెలుస్తుండగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టీజర్ సిరీస్‌పై భారీ అంచనాలకు క్రియేట్ చేసింది.

Next Story

Most Viewed