సొగసు చూడతరమా.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్న సిద్ధు, శ్రీనిధి

by Chukka Sudharani |

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’.

సొగసు చూడతరమా.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్న సిద్ధు, శ్రీనిధి
X

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చెయ్యగా.. ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ చార్ట్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ ఫస్ట్ సింగిల్ సిద్దు, రాశీ ఖన్నా అలరించగా.. రీసెంట్‌గా సెకండ్ సింగిల్‌ను లేడీ సూపర్ స్టార్ నయనతార చేతుల మీదుగా లాంచ్ చేయించారు మేకర్స్. ఇందులో సిద్దు అండ్ శ్రీనిధి శెట్టి ‘సొగసు చూడతరమా’ అంటూ వచ్చి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సిద్ధు, శ్రీనిధి మధ్య కెమిస్ట్రీ అదిరిపోగా.. సిద్ధు స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టకున్నాడు.

వైరల్ ట్యూన్, అద్భుతమైన విజువల్స్‌తో ఈ పాట ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంతో నీరజ కోన డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పాటల చార్ట్ బస్టర్ హిట్స్ కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. భారీ అంచనాల మధ్య ‘తెలుసు కదా’ చిత్రం దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 17న విడుదల కానుంది.

Next Story