- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విక్టరీ వెంకటేష్ బర్త్ డే స్పెషల్.. ‘సంక్రాతికి వస్తున్నాం’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల
టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో వెంకటేష్ నటిస్తోన్న తాజా చిత్రం ‘సంక్రాతికి వస్తున్నాం’.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో వెంకటేష్(Venkatesh) నటిస్తోన్న తాజా చిత్రం ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankranthiki vasthunnam). ఈ సినిమాకు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary).. వెంకటేష్ సరసన నటిస్తున్నారు. వచ్చే ఏడాది (2025) జనవరి 14 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ రిలీజై.. తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గానే మూవీ టీమ్ గోదారి గట్టు(Godari gaṭṭu) సాంగ్ విడుదల చేసి జనాల్లో మరింత హైప్ పెంచారు. ఇప్పుడు చిత్రబృందం తాజాగా సంక్రాతికి వస్తున్నాం సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. నేడు విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ప్రోమో.. ‘నా లైఫ్ లోనున్న ఆ ప్రేమ పేజీ దీనా.. పేజీలో రాస్తున్న అందాల ఆ పేరు మీనా’ అంటూ సాగుతోన్న ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చివర్లో హ్యాపీ బర్త్ డే వెంకటేష్ అని రాసి ఉండగా.. వెంకీ పోలీస్ యూనిఫార్మ్‌లోనున్న లుక్ ప్రోమోకు మరింత హైలెట్‌గా నిలిచింది.






