- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా రిలీజ్‌కు ముందే రివ్యూ వచ్చేసింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన అభిషేక్ నామ
మా సినిమా జూలై 3న విడుదలైతే, జూలై 2కే నెగిటివ్ రివ్యూలు వచ్చాయంటూ అభిషేక్ నామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ నామ, 'డెవిల్' సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజే ఈ చిత్రానికి సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వినిపించింది. ముఖ్యంగా సినిమా రన్‌టైమ్ ఎక్కువగా ఉండటమే ప్రధాన మైనస్ అని పలువురు రివ్యూలలో పేర్కొన్నారు.
తాజాగా ఈ విషయంపై అభిషేక్ నామ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "మా సినిమా జూలై 3న విడుదలైంది. కానీ జూలై 2వ తేదీకే మా సినిమాపై నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు ఎలా వస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను రివ్యూలను గౌరవిస్తాను. కానీ ఆ రివ్యూల్లో ఎంత నిజం ఉందో కూడా తెలుసుకోవాలి. కామన్ ఆడియన్స్ అభిప్రాయాన్ని నమ్మడం చాలా మంచిది" అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. "సినిమా రన్‌టైమ్ విషయంలో చాలామంది సూచనలు చేశారు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఒక పాట అనవసరంగా ఉందని చెప్పడంతో దానిని తొలగించాం. అలాగే క్లైమాక్స్ కూడా కొంచెం పెద్దగా ఉందని సూచించడంతో దానిని ట్రిమ్ చేశాం. దీంతో సినిమా మరింత బెటర్‌గా మారింది. అయితే కొంతమంది కావాలనే పనికట్టుకుని నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. నేను కొత్త దర్శకుడిని. కొత్త హీరో, కొత్త నిర్మాతలతో ఈ సినిమా చేశాం. మమ్మల్ని ప్రోత్సహించండి. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి" అంటూ అభిషేక్ నామ చెప్పుకొచ్చారు.






