'నాగ బంధం' నుంచి 'వీరనాగ' సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది

by Pulgam srinivas |

'నాగబంధం' నుంచి 'వీరనాగ' పాటను జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

నాగ బంధం నుంచి వీరనాగ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుసగా ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'వీరనాగ' పాట విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాటను జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ పాటపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి 'వీరనాగ' సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అభిషేక్ నామ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు.





Next Story