- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ-2ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయకపోవడానికి కారణం ఇదే: డైరెక్టర్ బోయపాటి
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ..

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిన అఖండ -2 ది తాండవం డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కురిపిస్తోంది. సనాతన ధర్మం, ధర్మం కోసం ఎంతకైనా తెగించే అఖండను డైరెక్టర్ అద్భుతంగా చూపించాడంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా అఖండ-2ను సెప్టెంబర్ 25న ఎందుకు విడుదల చేయలేదో వివరించారు.
అఖండ-2 సినిమాను 135 రోజుల్లో తీశామని, కొబ్బరికాయ కొట్టినరోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని బాలయ్యకు ముందే చెప్పానన్నారు. అనుకున్నట్లుగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేసేందుకు కాపీ కూడా రెడీ అయిందన్నారు. కానీ ఆ సమయానికే పవన్ కల్యాణ్ OG సినిమా కూడా రిలీజ్ కు ఉండటంతో.. బాలయ్య వెనక్కి తగ్గారని బోయపాటి తెలిపారు. తమ్ముడికి దారి ఇద్దామని, రెండ పెద్దసినిమాలు ఒకేసారి వస్తే థియేటర్లు షేర్ అవుతాయని,రెండూ బాగుంటే రెవెన్యూకి మనమే ఇబ్బంది పెట్టుకున్నట్లవుతుందని బాలయ్య అభిప్రాయపడ్డారన్నారు. అలా అఖండ-2 సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడిందని తెలిపారు.






