- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ది రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్ 2.0 వచ్చేసింది
2.0 పేరుతో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తో ఈ సినిమాలో

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త అందింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ది రాజా సాబ్ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 2.0 పేరుతో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తో ఈ సినిమాలో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
హారర్ తో పాటు కామెడీని చాలా చక్కగా దర్శకుడు మారుతి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ హీరోగా చేయగా ముగ్గురు హీరోయిన్లు మెరుస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ప్రభాస్ మూవీ, జనాలను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






