- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
The Rajasaab Teaser: పాత రికార్డులు బద్దలు కొడుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘రాజాసాబ్’ టీజర్.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టులలో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) ఒకటి.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టులలో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) ఒకటి. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ (Teaser) తాజాగా రానే వచ్చింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను కూడా ఆకట్టుకోవడంతో అత్యధిక వ్యూస్ సాధిస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ క్రమంలోనే పాత రికార్డులు బద్దలు కొడుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ మేరకు టీజర్ రిలీజైన కేవలం 24 గంటల్లోనే 59 మిలియన్ (59 million) ఫ్లస్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. టీజర్‌కు వస్తున్న భారీ వ్యూస్ ‘ది రాజాసాబ్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇక వింటేజ్ లుక్‌లో ప్రభాస్ కనిపించిన తీరు, హారర్ సీన్స్, ప్రభాస్ కామెడీ టైమింగ్స్, గ్రాండ్ మేకింగ్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు ఇలా ప్రతీది రాజాసాబ్ మూవీపై అంచనాలు భారీగా పెంచేశాయి. డార్లింగ్ ప్రభాస్‌ను ఎలా చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారో.. ఫైనల్‌గా అలా దర్శనమివ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా.. మారుతి (Maruti) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.






