- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ravi Shankar: టికెట్ల రేట్ల పెంపుపై పుష్ప-2 నిర్మాత మరోసారి కీలక వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
టికెట్ల రేట్ల పెంపుపై పుష్ప-2(Pushpa-2) నిర్మాత రవి శంకర్(Ravi Shankar) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టికెట్ల రేట్ల పెంపుపై పుష్ప-2(Pushpa-2) నిర్మాత రవి శంకర్(Ravi Shankar) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం పుష్ప-2 సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. టికెట్ ధరల పెంపుపై చర్చిస్తున్నట్లు తెలిపారు. పుష్ప-2 టికెట్ ధరలు అందుబాటులోనే ఉన్నాయని అన్నారు. రూ.800 అనేది కేవలం ప్రీమియర్ వరకే ఉందని చెప్పారు. ప్రస్తుతం పుష్ప-2 రూ.500 కోట్లకు పైనే వసూలు చేసిందని తెలిపారు. ఇంకెన్ని వసూళ్లు సాధిస్తుందో చెప్పలేకపోతున్నామని అన్నారు. త్వరలోనే అన్నీ రివ్యూ చేసుకుని, ధరలు అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన మాత్రం మమ్మల్ని కలచి వేసిందని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మరోసారి ప్రకటన చేశారు.
Next Story






