- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘VD-12’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత.. సినిమా చూస్తే మీరే షాక్ అవుతారంటూ..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘VD-12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్స్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీపై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం రెండు భాగాలు అనుకొని ప్లాన్ చేశాము, అలా అని కథ రెండో భాగంలో పెట్టి ఫస్ట్ పార్ట్ సస్పెన్స్‌తో నడిపించడం లేదు. మొదటి భాగం చూసిన సరిపోద్ది. ఇక ఈ మూవీ కంటెంట్ చూసిన తర్వాత మీరే షాక్ అవుతారు. ఈ మధ్యనే నేను మా బాబాయ్, ఎడిటర్ నవీన్(Naveen) ఫస్ట్ ఆఫ్ చూసుకున్నాం. జెర్సీ(Jersey) మూవీ తీసిన గౌతమే(Goutham)నా ఈ సినిమా తీసింది అనేలా వీడీ 12 ఉంటుంది’ అని నిర్మాత చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది.






