Siva Karthikeyan: విప్లవానికి నాంది పలుకబోతున్నాం.. హైప్ పెంచుతున్న ‘SK-25’ పోస్టర్.. సర్‌ప్రైజ్ వచ్చేస్తుందంటూ మేకర్స్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-01-29 13:06:13  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది అయలాన్, అమరన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు.

Siva Karthikeyan: విప్లవానికి నాంది పలుకబోతున్నాం.. హైప్ పెంచుతున్న ‘SK-25’ పోస్టర్.. సర్‌ప్రైజ్ వచ్చేస్తుందంటూ మేకర్స్ ట్వీట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది అయలాన్, అమరన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇందులో ‘అమరన్’ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. రాజ్ కుమార్ పెరియస్వామి(Rajkumar Periyaswamy) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రం దీపావళి కానుకగా వచ్చి బాక్సాఫీసు వద్ద హిట్ నిలవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శివకార్తికేయన్ ‘SK-25’ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.

సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను పీరియాడిక్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. డాన్ పిక్చర్స్(Dawn Pictures) బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. జయం రవి(Jayam Ravi), అధర్వ మురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదల కాబోతుంది. తాజాగా, ‘SK-25’ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఇందులో ఆయన మంటను పట్టుకుని వెనకాలకు తిరిగి ఉన్నారు. ఈ పోస్టర్‌కు ‘‘విప్లవం ఎవరి కోసం వేచి ఉండదు.. విప్లవానికి రేపు నాంది పలుకబోతున్నాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అనౌన్స్‌మెంట్ రేపు సాయంత్రం (జనవరి 29) 4 గంటలకు ఉండబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. శివకార్తికేయన్ ఏదో సరికొత్త స్టోరీతో రాబోతున్నాడని అంటున్నారు.

Next Story