యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పెద్ది’ ఐటెం సాంగ్.. ఇద్దరు హీరోయిన్లతో మెగా హీరో రచ్చ!

by Mallepaka Hamsa |

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచగా.. ఇప్పుడు ఓ మాస్ సాంగ్‌ విడుదల కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పెద్ది’ ఐటెం సాంగ్.. ఇద్దరు హీరోయిన్లతో మెగా హీరో రచ్చ!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. గత కొద్ది కాలంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన ‘పెద్ది’ జూన్ 4న థియేటర్స్‌లోకి రాబోతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచగా.. ఇప్పుడు ఓ మాస్ సాంగ్‌ విడుదల కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. చీర చొక్క.. చిక్కెడిపోవాలో అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్‌తో పాటుగా ఇందులో హీరోయిన్‌గా చేసిన జాన్వీ కపూర్ కూడా చిందులేసింది. ముగ్గురు స్టార్ల డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను రక్షిత సురేష్ అద్భుతంగా పాడారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Next Story