- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటిస్తూ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్
గత కొద్ది రోజుల నుంచి సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. హిట్ సినిమాలకు కొనసాగింపుగా తీసుకున్న చిత్రాలెన్నో ప్రేక్షకుల్లో మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి. దీంతో ఈ బాటలోనే స్టార్ హీరో సైతం సీక్వెల్స్ ప్రకటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) హిట్ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. ‘దృశ్యం-3’(Drishyam -3) రాబోతున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం-3 రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు.
అయితే ఈ సినిమాకు జీతూ జోసెఫ్ (Jeetu Joseph)దర్శకత్వం వహిస్తుండగా.. ఆంటోని పెరుంబవూర్(Anthony Perumbavoor) నిర్మిస్తున్నారు. కాగా, 2013లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఘన విజయం సాధించింది. అయితే ఈచిత్రం ఇతర భాషల్లోనూ రీమేక్ అయి అన్ని చోట్లా హిట్‌గా నిలవడం విశేషం. ఇక ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం-2’ కూడా హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుటు దీనికి పార్ట్-3 తీసుకురాబోతున్నారు మూవీ మేకర్స్. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.






