- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రగా బొబ్బలెక్కిన మెగా బ్యూటీ ఆ పార్ట్.. కాలిపోయిందంటూ ఎమోషనల్ పోస్ట్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janvi Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janvi Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక గత ఏడాది జాన్వీ కపూర్, ఎన్టీఆర్(NTR) ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
ఆ తర్వాత వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం జాన్వీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘rc-16’లో నటిస్తుంది. అలాగే హిందీలో ‘పరం సుందరి’ (Param Sundari)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రొమాంటిక్ కామెడీ సినిమాగా రాబోతుండగా.. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) హీరోగా నటిస్తున్నారు. ఈ క్రమంలో.. షూటింగ్‌కు గ్యాప్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు పెడుతూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, జాన్వీ కపూర్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
బాత్రూం ఉన్న ఆమె వీపుపై బొబ్బలు వచ్చినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేసింది. అలాగే కాలిపోయిందంటూ ఎరుపెక్కిన ఎమోజీ ఏడుస్తున్నట్లుగా ఉన్న పిక్ షేర్ చేసింది. ప్రస్తుతం జాన్వీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా అయ్యే ఏమైంది అంతగానం ఏం చేసావు అని తెగ బాధపడిపోతున్నారు. అలాగే జాగ్రత్తగా ఉండు త్వరగానే తగ్గుతాయిలే అని చెబుతున్నారు. అయితే ఈ బొబ్బలు ‘పరం సుందరి’ షూటింగ్ వల్లనే అయినట్లు సమాచారం. ఎండా వాన అని పట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నందుకు ఇలా వీపు కందిపోయిందని నెట్టింట చర్చించుకుంటున్నారు.






