- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది.. యూత్ ఊగిపోవాల్సిందేనా
ది ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‍ను ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్'లో హీరోగా నటిస్తున్నాడు. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఆగస్టు 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మొదటి సింగిల్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
'ఆయా షేర్' అంటూ సాగే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ను ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న మూవీ కావడం, ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతూ ఉండడంతో ఈ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మొదటి సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా యూత్ ను చాలా బాగా అలరిస్తుందని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.






