మెగా హీరో కోసం వెన‌క్కి త‌గ్గ‌నున్న నాని..ఈ సినిమా వాయిదా ?

by velandi.Saikiran |

రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

మెగా హీరో కోసం వెన‌క్కి త‌గ్గ‌నున్న నాని..ఈ సినిమా వాయిదా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సంక్రాంతి బరి ముగిసింది. ఇక మార్చిలో మరో రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. నాని చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా ఒకటి కాగా... మరొకటి రామ్ చరణ్ చేసిన పెద్ది. ఈ రెండు సినిమాలు మార్చి చివరలో రిలీజ్ కాబోతున్నాయి. కేవలం ఒక్కరోజు గ్యాప్ తో.. రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ కాగానే, ఎవరో ఒకరు తప్పుకోవాలని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో నాని ది ప్యారడైజ్ సినిమా బృందం కీలక నిర్ణయం తీసుకుందట. మార్చిలో కాకుండా సమ్మర్ లో తమ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోందట. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో పోటీ వద్దని చిత్ర బృందం నిర్ణయం తీసుకుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సమ్మర్ లో మంచి డేట్ చూసుకుని రావాలని అనుకుంటున్నారట. ఇదే జరిగితే రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అయినట్లేనని చర్చ జరుగుతోంది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పెద్ది సినిమా

రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరుస్తున్నారు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో రాబోతున్నట్లు టాక్. కాగా మార్చి 27వ తేదీన పెద్ది సినిమా రిలీజ్ కానుంది. అటు ది ప్యారడైజ్ సినిమా మార్చి 26వ తేదీన రిలీజ్ అవుతుంద‌ని ఇప్పటికే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

Next Story