The Paradise : 30 మిలియన్ మార్క్ టచ్ చేసిన ఆయా షేర్

by Pulgam srinivas |

The Paradise : ఈ సినిమాలోని ఆయా షేర్ లిరికల్ వీడియోకి ఇప్పటివరకు 30 మిలియన్ వ్యూస్, 883k లైక్స్ దక్కినట్లు, ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

The Paradise : 30 మిలియన్ మార్క్ టచ్ చేసిన ఆయా షేర్
X

దిశ, వెబ్ డెస్క్ : నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో నాని, శ్రీకాంత్ కాంబోలో దసరా అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో మొదటి నుండే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఆయా షేర్ అంటూ సాగే మంచి మాస్ బీట్ లిరికల్ వీడియోను విడుదల చేసింది.

దీనికి విడుదల అయిన తర్వాత నుండే మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించడం మొదలైంది. ఈ సాంగ్ ఎన్నో కొత్త రికార్డులను కూడా సృష్టిస్తూ ముందుకు వెళుతుంది. తాజాగా ఈ సాంగ్ 30 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే 888k లైక్స్ ను కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో, ఇందులో నాని వేసిన మాస్ స్టెప్పులకి కూడా అదే స్థాయి ఆదరణ దక్కుతుంది.

ప్రస్తుతం ఈ సాంగ్ కి వస్తున్న వ్యూస్ ను బట్టి చూస్తే మరో ఒకటి, రెండు రోజుల్లో 50 మిలియన్ టచ్ చేసే అవకాశం చాలా వరకు ఉంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.




Next Story