The Padadise: 'ఆయా షేర్' సెన్సేషన్.. ప్రేక్షకుల నుంచి ఊర మాస్ రెస్పాన్స్

by Pulgam srinivas |

‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ‘ఆయా షేర్’ సాంగ్ యూట్యూబ్‌లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

The Padadise: ఆయా షేర్ సెన్సేషన్.. ప్రేక్షకుల నుంచి ఊర మాస్ రెస్పాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘ఆయా షేర్’ అంటూ సాగే తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్‌కు కసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అలాగే అనిరుద్ రవిచందర్, అడ్డుల జంగిరెడ్డి, కసర్ల శ్యామ్, అర్జున్ చండి ఈ పాటను ఆలపించారు. సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటకి విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తొలి 24 గంటల్లోనే ఈ సాంగ్ భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్ దక్కించుకుంది. ఇప్పటికీ ఈ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా యూట్యూబ్‌లో ఈ సాంగ్ 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.




Next Story