- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ సంస్థ చేతికి రవితేజ ‘ఇరుముడి’ ఓవర్సీస్ హక్కులు
రవితేజ 'ఇరుముడి' ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ఇటీవల తన రూట్ మార్చి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొంతకాలం క్రితమే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రంతో ఈ నటుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రవితేజ ‘ఇరుముడి’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను పరిశీలిస్తే, ఈ మూవీలో రవితేజ అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప భక్తుడిగా కనిపించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






