- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిపీట్ కానున్న 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' కాంబో
సిద్ధార్థ్–త్రిష జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఒక సినిమాను నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: సిద్ధార్థ్–త్రిష జంటగా నటించిన సినిమాలలో 2005లో విడుదలైన “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించగా, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎం. ఎస్. రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీహరి, ప్రకాష్ రాజ్, వేద తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన సమయంలోనే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సిద్ధార్థ్–త్రిష జంటకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్, త్రిష జంటగా ఓ సినిమాను నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారని, దీనికి ఒక కొత్త దర్శకుడిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైతే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






