కోట శ్రీనివాస రావు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

by I. Sairam |   (  Updated:2025-07-13 03:25:56  IST  )

తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu film industry)లో తీవ్ర విషాదం నెలకొంది.

కోట శ్రీనివాస రావు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu film industry)లో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు (Senior Tollywood actor) కోట శ్రీనివాస రావు(83) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శ్లోక సంద్రంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కోట మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాస రావు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది.

'ప్రాణం ఖరీదు' చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తర్వాత వందల కొద్ది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట. కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు.

రీసెంట్‌గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకు ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

Link

Next Story