- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రావు బహదూర్' కొత్త విడుదల తేదీ వచ్చేసింది
‘రావు బహదూర్’ చిత్రాన్ని జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తొలుత జూన్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే జూన్ 4న రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, భారీ చిత్రానికి పోటీగా రావడం మంచిది కాదని భావించిన మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ‘రావు బహదూర్’ చిత్రాన్ని జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






