సరికొత్త ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం స్టార్ట్.. చూస్తే సుస్సు పోసుకోవాల్సిందే..!

by Chukka Sudharani |

ఏకే జంపన్న (A.K. Jampanna) డైరెక్షన్‌లో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం1గా తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది.

సరికొత్త ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం స్టార్ట్.. చూస్తే సుస్సు పోసుకోవాల్సిందే..!
X

దిశ, సినిమా: ఏకే జంపన్న (A.K. Jampanna) డైరెక్షన్‌లో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం1గా తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయింది. గగన్ బాబు (Gagan Babu), కశికా కపూర్ (Kashika Kapoor)జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో.. సత్యం రాజేష్, సాయి రోనఖ్, పృద్వీ, మణిచందన, మహేష్ విట్టా, రంగస్థలం మహేష్ , నాగ మహేష్, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీకి ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా హీరో గగన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సాహు, వివేక్, శంకర్ ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది.. అద్భుతమైన ఎమోషన్స్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది అందుకే వెంటనే ఓకే చేశానని అన్నారు. నిర్మాత ఈ కథ విన్న వెంటనే తనే ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చారు. ఈ సినిమా కంప్లీట్‌గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందని, ఇది ప్యూర్ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటినీ క్రియేట్ చేశాడు ఈ కొత్త హీరో. ఇక త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్.

Next Story