వైట్ డ్రెస్స్‌లో మెరిసిన నేషనల్ క్రష్.. అదిరిపోయే క్యాప్షన్‌తో మతి పొగొట్టేసిందిగా!?

by Jakkula.Mamatha |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

వైట్ డ్రెస్స్‌లో మెరిసిన నేషనల్ క్రష్.. అదిరిపోయే క్యాప్షన్‌తో మతి పొగొట్టేసిందిగా!?
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తక్కువ టైంలోనే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో తన నటనతో, అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. రష్మిక మందన్న చేసింది తక్కువ సినిమాలే అయినా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకుంది.

రష్మిక మందన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ తరుణంలో తాజాగా నేషనల్ క్రష్ రష్మిక ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో వైట్ కలర్ డ్రెస్ ధరించి, తలలో తెల్లటి పువ్వులు పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ రాశారు. ‘‘ప్రపంచాన్ని చుట్టేయండి, తప్పులు చేయండి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి, ప్రేమించండి, బిగ్గరగా నవ్వండి, ఆనందంగా జీవించండి, లైఫ్ ను ఎంజాయ్ చేయండి. ఇతరులను, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. దయ కలిగి ఉండండి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. లేటెస్ట్ ఫొటులు ఇవే..

Next Story