- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పిరిట్ మూవీ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్.. ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో మన ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో మన ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), దీపిక పదుకొణె(Deepika Padukone), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటానీ(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ప్రస్తుతం ప్రభాస్.. ‘ఫౌజీ’(Fouji), ‘కల్కి-2’(Kalki-2), ‘సలార్-2’(Salar-2), ‘రాజా సాబ్’(Raja Saab), ‘స్పిరిట్’(Spirit) వంటి భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ , స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. దీనిని టీ- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ ఇయర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుండగా.. ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్.
స్పిరిట్ మూవీకి మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్(Harshvardhan Rameshwar) అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ డార్లింగ్ అంటే నాకు అభిమాని, అందుకే ఈ చిత్రం కోసం కసిగా పని చేస్తున్నాను. అద్భుతమైన సంగీతం అందిస్తాను. సందీప్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆయనతో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్.. అయితే ఈ సినిమాలో దాన్ని కొనసాగిస్తాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హర్షవర్ధన్ రామేశ్వర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇది విన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






