- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సింహం గర్జిస్తుంది’ అంటూ మోగ్లీ న్యూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మూవీ టీమ్.. ట్వీట్ వైరల్
స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న సినిమా 'మోగ్లీ'(Mowgli).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న సినిమా 'మోగ్లీ'(Mowgli). కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ సాక్షి(Sakshi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasd), కృతి ప్రసాద్(Kruthi Prasad) ఈ సినిమాను నిర్మించారు.
అయితే... డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2'(Akhanda-2) కారణంగా వాయిదా పడింది. దీంతో న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఆడియన్స్‌తో పాటు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో తాజాగా చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.
ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘"సింహం" గర్జిస్తుంది, మరియు మోగ్లీ అడవి రాజును స్వాగతించడానికి వెనక్కి వస్తాడు.. ఈ సినిమా ప్రీమియర్స్ ను 12వ తేదీ రాత్రి వేసి, మూవీని 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో రోషన్ కనకాల నవ్వుతుండగా, సాక్షి క్యూట్‌గా చూస్తుండగా, సరోజ్ కుమార్ మాత్రం ఫేస్ మీద గాయాలతో సీరియస్‌గా చూస్తున్నాడు. కాగా 2.40 నిమిషాలు గల ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది.






