Pushpa 2: ‘పుష్ప 2’ మూవీ వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. ఈ సారి అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే.. సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ రివ్యూ!

by Phanindra |

గురువారం (డిసెంబర్ 5) తెల్లవారుజామున 4 గంటల నుంచి ‘పుష్ప 2 ది రూల్’ షోలు మొదలయ్యాయి.

Pushpa 2:  ‘పుష్ప 2’ మూవీ వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. ఈ సారి అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే.. సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ రివ్యూ!
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా నటించిన "పుష్ప 2" ( Pushpa 2) మూవీ నేడు దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ థియేటర్లలో సందడీ చేస్తుంది. కొన్ని ఏరియాల్లో డిసెంబర్ 4 రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. కొన్ని చోట్ల గురువారం (డిసెంబర్ 5) తెల్లవారుజామున 4 గంటల నుంచి ‘పుష్ప 2 ది రూల్’ షోలు మొదలయ్యాయి.

బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. మూవీ లవర్స్ అందరూ పుష్ప 2 మూవీని చూడటానికి వెళ్తున్నారు. పుష్ప 2 మూవీ ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతోంది. నేషనల్ వైడ్‌గా పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా, పుష్ప 2 మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ పుష్ప 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు.

ఈ మూవీ గురించి ఒక్క మాటలో మెగా బ్లాక్ బస్టర్ అంటూ తరణ్ ఆదర్శ్ ( Taran Adarsh) ట్వీట్ చేశారు. ఆయన అయితే ఏకంగా ‘పుష్ప 2 ది రూల్’కి 4.5 రేటింగ్ ఇచ్చారు. " ఇది వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. మూవీ చూస్తున్నంత సేపు ప్రతి సీన్‌ అద్భుతంగా ఉంటుంది.. ఈ సారి అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే దక్కుతాయి. బన్నీ నటన అయితే సూపర్. క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో ఫహద్ ఫాసిల్ బాగా నటించాడు. మూవీలో వీరిద్దరి కాంబో సీన్స్ అందర్ని ఆకట్టుకుంటాయి. సినిమా ఫోకస్ అంతా అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్‌పైనే ఉంది. రష్మిక మందన్న తన నటనతో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మూవీకి దర్శకుడు సుకుమార్ ( Sukumar) జాదూగర్… బాక్సాఫీస్ తుపాను వచ్చేసింది " అంటూ ట్వీట్ లో తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో రాసుకొచ్చారు.

Next Story