- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాకుండానే టీవీలోకి వచ్చేస్తున్న ‘కింగ్‌స్టన్’ మూవీ.. ఫాంటసీ అడ్వెంచర్ ఎందులోకి రానుందంటే?
కోలీవుడ్ సంగీత దర్శకుడు హీరో జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌స్టన్’(Kingston).

దిశ, సినిమా: కోలీవుడ్ సంగీత దర్శకుడు హీరో జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌స్టన్’(Kingston). అయితే ఇందులో దివ్య భారతి హీరోయిన్‌గా నటించగా.. కమల్ ప్రకాష్(Kamal Prakash) దర్శకత్వం వహించారు. దీనిని జీ స్టూడియోస్ అండ్ ప్యారాలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మించారు. అయితే ఈ సినిమా మార్చి 7న భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే ఈ చిత్రం కథ విషయానికొస్తే.. తమిళనాటులోని సముద్ర తీర తూవత్తూర్‌లో జరిగిన కథగా తెలుస్తోంది. 1982లో జరిగిన ఓ సంఘటన ఆ గ్రామం జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
ఇక మత్స్యకారులుగా జీవనం సాగించే గ్రామస్థులు సముద్రంలోకి వెళితే శవాలుగా తిరిగి వస్తారు. దానికి కారణాలు ఏంటో తెలియనప్పటికీ సముద్రంలోకి వెళ్లడం మానేస్తారు. ఆ తర్వాత వారి జీవనోపాధికి చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే హీరో ఈ పరిస్థితి ఎలా నిలబడ్డాడో ఇందులో చూపించారు. తాజాగా, ‘కింగ్‌స్టన్’ ఒకేసారి టీవీలో, ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సీ ఫాంటసీ అడ్వెంచర్ ఏప్రిల్ 13న జీ5లో 12 గంటలకు రాబోతుంది. అలాగే తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన సినీ ప్రియులు ఆనంద పడుతున్నారు.
The sea calls. He answers! 🌊 🧟 #Kingston Arrives on 13th April! ⛵
— ZEE5 Tamil (@ZEE5Tamil) April 3, 2025
India's First Marine Fantasy Blockbuster #Kingston Premiering on OTT & TV on April 13th 12pm!#KingstonFromApril13thOnZEE5@gvprakash @storyteller_kp @ZeeStudiosSouth @ParallelUniPic @divyabarti2801… pic.twitter.com/QRPHkXcy6W






