- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ajith Kumar: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఓ వైపు రేసింగ్ కాంపీటీషన్‌లో పాల్గొంటూనే వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఓ వైపు రేసింగ్ కాంపీటీషన్‌లో పాల్గొంటూనే వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటున్న ఆయన హిట్ కోసం తపన పడుతున్నారు. అయితే అజిత్ కుమార్ ఇటీవల ‘విదాముయార్చి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ హిట్ సాధించలేకపోయారు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly)ఏప్రిల్ 10న విడుదలైంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్(Arjun Das), సిమ్రాన్, ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) కీలక పాత్రలో కనిపించారు.
జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. మే 8 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వాటిని చూసిన అజిత్ కుమార్ అభిమానులు సంతోషపడుతున్నారు.






