- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Charan: చరణ్ కెరీర్‌లోనే అత్యంత రిస్కీ స్టంట్స్.. ఆందోళనలో అభిమానులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఫస్ట్ షాట్ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే చిత్రం యూనిట్, విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ బ్లాక్‌ను పూర్తి చేసింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో భారత సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఇది ఇండియన్ యాక్షన్ సినిమాల ప్రమాణాలను పెంచేలా ఉన్న హై-ఆక్టేన్, హై బడ్జెట్‌తో రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో ఈ స్టంట్‌లో తన అభిమాన హీరోకు ఏం జరగకూడదు అని కోరుకుంటూనే.. ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






