కొడుకుతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న మెగా కపుల్.. బాబు ఎంత క్యూట్ ఉన్నాడో..

by I. Sairam |   (  Updated:2025-12-26 04:18:31  IST  )

టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej)- అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ల జంట‌ ఒక‌టి.

కొడుకుతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న మెగా కపుల్.. బాబు ఎంత క్యూట్ ఉన్నాడో..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej)- అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ల జంట‌ ఒక‌టి. ‘మిస్టర్’(Mister), ‘అంతరిక్షం’(Antariksham) అనే సినిమాల్లో జంటగా నటించిన వీరు ఆ టైమ్‌లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ విషయాన్ని బయట పడకుండా సీక్రెట్‌గా లవ్ చేసుకుని డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోస్‌తో ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చారు. అలా సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ జంట నవంబర్ 1, 2023లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే ఈ జంటకు సెప్టెంబర్ 2025లో మగబిడ్డ కూడా జన్మించాడు. దీంతో వీరిద్దరు తల్లిదండ్రులు ప్రమోషన్స్ పొందారు. అయితే బాబుకు ‘వాయువ్ తేజ్ కొణిదెల’(Vayuv Tej Konidela) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు అతని ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ జంట తమ బాబుతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంది.

ఆ పిక్స్‌లో వరుణ్ వాయువ్‌ను ఎత్తుకుంటే లావణ్య అది చూసి మురిసిపోతుంది. ఇక ఫొటోలో బాబు ఫేస్ కనబడకపోయినప్పటికీ మెగా వారసుడు చాలా అందంగా క్యూట్‌గా ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..‘క్రిస్మస్ కోసం మనం కోరుకునేది ఇక్కడే’ అనే క్యాప్షన్ జోడించారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

నాగచైతన్యకు బిగ్ షాకిచ్చిన శోభిత.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్!

Next Story