సాంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. వావ్, గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) గత ఏడాది ‘నా సామిరంగ’ (Naa Saami Ranga )చిత్రంతో హిట్ సాధించింది. ఇక ఆ తర్వాత నటించిన ‘మిస్ యు’ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

సాంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. వావ్, గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) గత ఏడాది ‘నా సామిరంగ’(Naa Saami Ranga ) చిత్రంతో హిట్ సాధించింది. ఇక ఆ తర్వాత నటించిన ‘మిస్ యు’ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ అషికా రంగనాథ్ ఫుల్ ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం అషికా గత వైభవ(Gatha Vaibhava), విశ్వంభర(Vishvambhara) వంటి సినిమాల్లో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ హీరో కార్తి సరసన ‘సర్దార్-2’చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. 2022లో వచ్చిన ‘సర్దార్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతుండగా.. దీనికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్(Malavika Mohanan), ఎస్ జే సూర్య, రాజిషా విజయన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఓ వీడియోను విడుదల చేస్తూ ‘సర్దార్-2’ అనౌన్స్‌మెంట్ రేపు రాబోతున్నట్లు ప్రకటించి క్యూరియాసిటీని పెంచేశారు. ఇక అషికా రంగనాథ్ వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా, ఈ భామ ట్విట్టర్ ద్వారా పలు ఫొటోలు షేర్ చేసింది. ఇందులో చిరకట్టులో ఉన్న ఆమె సాంప్రదాయ లుక్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు వావ్ గార్జియస్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story