స్టన్నింగ్ లుక్‌లో మెరిసిపోతున్న మెగా బ్యూటీ.. ఓ మై గాడ్ గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

స్టన్నింగ్ లుక్‌లో మెరిసిపోతున్న మెగా బ్యూటీ.. ఓ మై గాడ్ గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ‘దేవర’ (Devara: Part 1)సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో జాన్వీ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన నటించే చాన్స్ అందుకుంది. బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో రాబోతున్న ‘RC-16’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. జాన్వీ కపూర్ ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. అంతేకాకుండా ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా, జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి మెరిసిపోయింది. జలకన్య మాదిరిగా ఉన్న జాన్వీ స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వావ్, బ్యూటిఫుల్, స్టన్నింగ్ ఓ మై గాడ్ గార్జియస్ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రజెంట్ జాన్వీ హాట్ పిక్స్ అందరిలో హీట్ పుట్టిస్తున్నాయి.

Next Story