- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ రా స్టేట్‌మెంట్ వచ్చేస్తుందంటూ మేకర్స్ ట్వీట్
నేచురల్ స్టార్ నాని (nani)వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (nani)వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు చిత్రాల్లో నటిస్తూనే నిర్మాతగానూ సినిమాలు తెరకెక్కిస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ఇటీవల ‘కోర్టు’ మూవీని నిర్మించగా.. ఈ చిత్రం థియేటర్స్‌లో సూపర్ హిట్ కావడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టడంతో నానికి లాభాలు వచ్చాయి. ఇక ఇటీవల ఆయన నటించిన ‘హిట్-3’ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న థియేటర్స్‌లోకి వచ్చి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’.
శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను slv బ్యానర్‌పై చేరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇక ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ (The Paradise)చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిర మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అవుతున్నట్లు తెలుపుతూ సరిగమ సంస్థ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాకు రాక్‌స్టార్స్ రిదమ్ స్టార్ట్.. అంటూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ‘‘ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రా ప్రకటన రేపు ఉదయం 11.07 గంటలకు పోస్ట్ చేయబడుతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






